ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 4: జిల్లా విద్యా కుసుమాలు విరబూశాయి. కష్టపడితే ఫలితం రాక తప్పదని నిరూపించాయి. నీట్లో జిల్లాకు లభించిన ర్యాంకులే ఇందుకు నిదర్శనాలుగా నిలిచాయి. వైద్య విద్యలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జాతీయస్థాయిలో ఇటీవల నీట్ పరీక్షను నిర్వహించగా.. మంగళవారం ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు కళాశాలల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించి జిల్లా ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేశారు.
నీట్ ఫలితాల్లో ఖమ్మం శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య తెలిపారు. తమ కళాశాల విద్యార్థులు కే.మణిదీప్ 650 మార్కులు, బీ.మధు 627 మార్కులు, నసీమ్-604, బీ.సాయి-601, సింధు-586, కార్తీకేయని-582, నితిష-574, మనోహర్-571 మార్కులతో రాణించినట్లు వివరించారు. టాప్ వైద్య కళాశాలల్లో అత్యధిక మెడికల్ సీట్లు పొందే ఫలితాలను తమ విద్యార్థులు సాధించారని అన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ సాయిగీతిక, డీజీఎం చేతన్మాధుర్, డీన్ వర్మ, ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, ప్రకాష్, గోపాలకృష్ణ, ప్రిన్సిపాళ్లు అభినందించారు.
నీట్ పరీక్షలో హార్వెస్ట్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని కళాశాల కరస్పాండెంట్ పోపూరి రవిమారుత్ తెలిపారు. కళాశాల నుంచి 30 మంది విద్యార్థులు హాజరుకాగా అత్యధిక మంది మంచి మార్కులతో ఉత్తమ ర్యాంకులు సాధించారని అనాత్నరు. జిఘ్నేష్ కృష్ణప్రసాద్ 667 మార్కులు, శ్రీప్రియతమ్-633, పునీత్-609, నవదీప్-600, గోకుల్కిశోర్రెడ్డి-596, హేమసాయి-571, శారోన్పెర్సిస్-551, కుశల్తేజ-516 మార్కులు సాధించినట్లు వివరించారు. సాధారణ స్థాయి విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించామని అన్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రిన్సిపాల్ రామసహాయం పార్వతిరెడ్డి అభినందించారు.
నీట్ ఫలితాల్లో రెజొనెన్స్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారని, మంచి ర్యాంకులు సాధించారని కళాశాల డైరెకర్లు రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్‌రావు తెలిపారు. తమ కళాశాల విద్యార్థులు చంద్రికాలక్ష్మి-559, జోషిక-521, మమత-518, సాయిదర్శన-483, తనుశ్-468, తను-463, జాహ్నావి-452 మార్కులు సాధించినట్లు వివరించారు. ఇంటర్‌తోపాటు నీట్, ఎప్‌సెట్ వంటి పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రిన్సిపాళ్లు సతీశ్, భాస్కర్‌రెడ్డి, అధ్యాపకులు అభినందించారు.
నీట్ 2024 ఫలితాల్లో న్యూవిజన్ కళాశాల విద్యార్థులు ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల అధినేత చుంచు గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. జాతీయస్థాయిలో నిహారిక-780, హర్షిత్-1086, గణేశ్-2315, జాగృతి పవార్-2339, పూజిత-4187, కార్తీక్-5408, సందీప్-6427, చైతన్యసాయి-6888, ప్రణతి-8679, స్నేహ-9530వ ర్యాంకులతో రాణించినట్లు వివరించారు. జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో జిల్లాలో ఏ కళాశాల కూడా సాధించని ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి అగ్రగామిగా నిలిచారని అన్నారు. విద్యార్థులను, అధ్యాపకులను అకడమిక్ డైరెక్టర్ కార్తీక్, డైరెక్టర్ చుంచు గోపిచంద్, ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు అభినందించారు.
నీట్ ఫలితాల్లో కృష్ణవేణి కళాశాల విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారని కళాశాల అధినేత యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. కళాశాల విద్యార్థి ఎన్.భరత్ తేజ 720 మార్కులకు గాను 700 మార్కులతో జిల్లాలో అగ్రస్థానం సాధించినట్లు చెప్పారు. భరత్ వంశీ-560, లక్ష్మి-540, సాద్విక్-531, స్వాతి-527, దీపికా-492, గీతికా-471, ఇందు-464, కోమలి-430, సాయిషైనికా-406 మార్కులతో రాణించినట్లు వివరించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్లు గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ గుర్రం రాంచంద్రయ్య, అకాడమిక్ ఇన్చార్జి ఏలూరి వంశీకృష్ణ, ఏవో నిరంజన్ అభినందించారు.
నీట్ ఫలితాల్లో డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినట్లు అకాడమీ చైర్మన్ రాయల సతీశ్‌బాబు, డైరెక్టర్ ఈగా భరణికుమార్ తెలిపారు. తమ విద్యార్థుల్లో 216 మంది 400కిపైగా మార్కులు సాధించారని అన్నారు. వారిలో హారిక- 644 మార్కులు, పావనిశివాని-631, భగీరథ్-594, తేజస్విని-590, యజ్ఞ-587, పూజిత-585, రేఖ-578, విష్ణు-577, సాయిలక్ష్మి-568, ప్రత్యుష-568, జువ్వాద్-566, యాజ్-564, సాహితి-561, రిషితారాథోడ్-561, శ్రీవిద్య-560, ఝాన్సీ-557, వశిష్టమహర్షి-556, వాసిమ్-556, సౌమ్యశ్రీ-555, శ్రీజ-553, శివాని-544 మార్కులతో రాణించినట్లు వివరించారు. విద్యార్థులను అకాడమీ బాధ్యులు అభినందించారు.