ఇల్లెందు/ పాల్వంచ, ఏప్రిల్ 8: కార్మికులను కట్టు బానిసలుగా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఐఎఫ్టీయూ(ఇఫ్టూ) ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఇల్లెందు, పాల్వంచ పట్టణాల్లో నల్ల జెండాలతో బుధవారం నిరసన తెలిపారు. పాల్వంచ నటరాజ్ సెంటర్లో కార్మికుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఆయా కార్యక్రమాల్లో ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు కొక్కు సారంగపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ రాసుద్దీన్లు మాట్లాడుతూ భగత్‌సింగ్, బట్కేశ్వర్ దత్ల స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. నాయకులు కొప్పుల శ్రీనివాస్, నరాటి వెంకన్న, రామిశెట్టి నరసింహారావు, తొగరు సామేల్, పల్లి సుధాకర్, బి.లాలు, గౌని నాగేశ్వరరావు, ఎర్నం శ్రీను, నరసింహారావు, మల్లేశ్, బానోతు నవీన్, వెంకన్న, నాగయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.