ఇల్లెందు : ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ (Tribal welfare hostel ) డైలివేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు గత 23 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తుందని జేఏసీ నాయకులు అబ్దుల్ నబీ( Abdul Nabi) అన్నారు. ఇల్లెందు పట్టణ, మండల పరిధిలో ఉన్న బాలికల, బాలుర ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలలో పనిచేస్తున్న డైలివేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు శనివారం సమ్మెను తిరిగి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి, జేఏసీ నాయకులు లక్ష్మణ్, లక్ష్మీనారాయణ రామకళా ,మంగలు రొంపెడు బాలికల ఆశ్రమ పాఠశాల వద్ద సమ్మె శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తూ ఊడిగం చేయిస్తుందని వాపోయారు. పెండింగ్ వేతనాలు ఇవ్వకుండా, కొత్త మెనూ ప్రకారం మరింత పని భారం పెంచిందని ఆరోపించారు. టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో స్వామి, తారబాయ్,నాగేశ్వరరావు, వజ్జ నగేష్, కుమార్, హాస్టల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.