ముదిగొండ, ఫిబ్రవరి 16: ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం భక్తుల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని ముదిగొండ సొసైటీ అధ్యక్షుడు తుపాకుల యలగొండస్వామి తెలిపారు. బుధవారం ఆయన కుటుంబ సమేతంగా సమ్మక- సారలమ్మ సన్నిధికి వెళ్లి అక్కడి వసతుల గురించి వివరించారు. వరంగల్ నుంచి మేడారం జాతరకు హెలికాఫ్టర్ సర్వీసు ఉందన్నారు. కుటుంబ సమేతంగా హెలికాఫ్టర్లో మేడారం చేరుకున్నామన్నారు. ములుగు కలెక్టర్ తమకు స్వాగతం పలికారన్నారు. 20 నిమిషాల హెలికాఫ్టర్ ప్రయాణం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.