ఖమ్మం, డిసెంబర్ 19: ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఖండించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే ప్రస్తుత పాలకులు కేటీఆర్‌పై కేసు నమోదు చేయించారని అన్నారు.
ఇలాంటి కుట్రలు, కేసుల వల్ల బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మ ైస్థెర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టంచేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు సాగిస్తున్న పోరాటాలకు భయపడే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇలాంటి కేసులతో వేధించాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చకు సవాలు విసిరిన కేసీఆర్‌కు సమాధానం చెప్పలేక పలాయనం చిత్తగించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇలా అక్రమ కేసుకు పూనుకుందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో జైలు జీవితం గడిపిన రేవంత్‌రెడ్డి.. అందుకు ప్రతీకారంగానే కేటీఆర్‌పై అక్రమ కేసుకు తెరలేపారని ధ్వజమెత్తారు.