కారేపల్లి, జూన్ 02 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం కారేపల్లి మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్, తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ వెంకటేశ్వరరావు, పోలీస్ స్టేషన్ లో సీఐ సాగర్, ఎస్ఐ గోపితో పాటుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలలో జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలలో సర్పంచులు జెండా ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.