పే స్కేల్ వర్తింపజేయడం పట్ల సెర్ప్ ఉద్యోగుల హర్షం
పే స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేలకొండపల్లి, ఇల్లెందు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
- సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
- కాంట్రాక్టు ఉద్యోగాలు క్రమబద్ధీకరించినందుకు కృతజ్ఞతలు
నేలకొండపల్లి/ ఇల్లెందు రూరల్/ పెనుబల్లి, మార్చి 18: పే స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేలకొండపల్లి, ఇల్లెందు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2002 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు జీవో నెంబర్ 11 ప్రకారం పే స్కేల్ మంజూరు చేసినందుకు, క్రమబద్ధీకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.
మంచి వేతనం అందించడంతో పాటు తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని అన్నారు. సహకరించిన మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ కవితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. పెనుబల్లి మండలంలో పీడీ విద్యాచందన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

