ఖమ్మం అర్బన్, మే 9 : తోటి ఉపాధ్యాయులకు సబ్జెక్ట్‌లో మెళకువలు నేర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన గారపాటి జయరాజు(39) ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయా విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సంబంధించిన వర్క్‌షాపులో పాఠం చెబుతూ గుండెపోటుకు గురయ్యాడు. తోటి ఉపాధ్యాయులు సీపీఆర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో పాఠశాలతోపాటు మధిర పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.