కారేపల్లి, నవంబర్ 18 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభిస్తుందని కారేపల్లి తాసీల్దార్ అనంతుల రమేశ్, ఏడీఓ తుమ్మలపల్లి కరణశ్రీ అన్నారు. మంగళవారం కారేపల్లిలో ఐకేపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.2,389 తో సన్న రకాల వడ్లను కొనుగోలు చేస్తుందని, దానికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందన్నారు. రైతులు మధ్య దళారులకు ధాన్యాన్ని విక్రయించి నష్ట పోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించుకోవాలని సూచించారు.
ఐకేపీ ఆధ్వర్యంలో మాధారం, కారేపల్లి, మాణిక్యారం, సోసైటీ ఆధ్వర్యంలో విశ్వనాధపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మల్లెల రవీంద్రప్రసాద్, ఐకేపీ ఏపీిఎం పిడమర్తి వెంకటేశ్వర్లు, ఏఓ బట్టు అశోక్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పగడాల మంజుల, తలారి చంద్రప్రకాశ్, ఇమ్మడి తిరుపతిరావు, పొలగాని శ్రీనివాస్, కిలారి అప్పారావు, మల్లెల నాగేశ్వరరావు, దారావత్ వినోద్, హనీఫ్, ఏకేపీ సీసీి గౌషియా బేగం, ఏఈఓ ప్రమీల, ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు చీకుర్తి సుజాత, నాయిని కఅష్ణవేణి, స్వరూప, భయ్యా జయ పాల్గొన్నారు.