ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 2: ఖమ్మంలోని రైట్చాయిస్ ఆధ్వర్యంలో ఈ నెల 8న గ్రూప్-2, 3, 4, పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్లపై నిర్వహించనున్న అవగాహన సదస్సు వాల్‌పోస్టర్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రతి ఒక్కరికీ విజయం సాధించడం సాధ్యమేనని అన్నారు. నగరంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సుతోపాటు టాలెంట్ టెస్ట్ నిర్వహించి రూ.లక్ష విలువైన బహుమతిని అందించనున్నట్లు రైట్ చాయిస్ కిరణ్ పేర్కొన్నారు. 8985096699 నెంబరును సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఖమ్మం, జనవరి 2: తెలంగాణ మైనార్టీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం ఆవిష్కరించారు. నగరంలోని వీడీవోస్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్, టీస్ మెసా బాధ్యులు షేక్ అఫ్జల్‌హసన్, ఎండీ రజబ్అలీ, నాగుల్‌మీరా, ఎండీ హుస్సేన్, పాషా, ఎండీ హకీమ్ పాల్గొన్నారు.
జిల్లా ఆల్‌మేవా ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యాకుబ్ పాషా, షేక్ మదార్, నయిమ్ తదితరులు పాల్గొన్నారు.