సత్తుపల్లి, ఫిబ్రవరి 5: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి చదడం, రాయడం రావాలని ప్రభుత్వం రీడ్ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నదని ఎంఈవో బీ రాములు అన్నారు. పట్టణంలోని పాతసెంటర్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం చిత్తలూరి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేమన శతకపద్య పుస్తకాలను ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు గార్లపాటి పాపాచలం, బొల్లేపల్లి సత్యనారాయణరాజు ట్రస్టు నిర్వాహకులు రామకృష్ణ, మధుసూదన్రాజులు ఎంఈవో చేతులమీదుగా అందజేశారు. ఎంఈవో మాట్లాడుతూ కరోనా కారణంగా పిల్లలు రెండేళ్లుగా బడికి దూరమై చదువులో వెనుకబడ్డారని, అందుకే రీడ్ కార్యక్ర మం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం రాజేశ్వరరావు, గ్రంథాలయ ఇన్చార్జి రాపర్తి నాగమణి, విద్యాకమిటీ వైస్ చైర్పర్సన్ ముబీనా, ఎస్ఎంసీ సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వైరా, ఫిబ్రవరి 5: చదవడం అలవాటుగా మారాలనే సంకల్పంతో ‘చదువు..ఆనందించు..అభివృద్ధి చెందు’ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాలతో ప్రారంభించామని ఎంఈవో కొత్తపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని గొల్లపూడి ప్రాథమిక పాఠశాలలో శనివారం ‘చదువు- ఆనందించు- అభివృద్ధి చెందు’ కార్యక్రమాన్ని శనివారం ఎంఈవో ప్రారంభించి మాట్లాడారు. నీతి కథలు, బాలసాహిత్యాన్ని చదవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం డీ సత్యనారాయణ, జీ పద్మావతి, కే కిరణ్మయి, ఎం దయాకర్, జీ వాసు, ఎన్ నాగరాణి, సీఆర్పీ రవి పాల్గొన్నారు.
కొణిజర్ల, ఫిబ్రవరి 5: చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు (రీడ్) కార్యక్రమాన్ని పెంపొందించడం ద్వారా స్వతంత్ర పాఠకులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని కొణిజర్ల ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కే రవికుమార్ పేర్కొన్నారు. శనివారం కొణిజర్ల ప్రభుత్వ పాఠశాలలో రీడ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదవడంపై మరింత పట్టు సాధించాలన్నారు.కార్యక్రమంలో ఎంఈవో మోదుగు శ్యాంసన్, కొణిజర్ల స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం దామాల పుల్లయ్య, సీఆర్పీ కట్ల నాగరాజు, గోవిందరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కారేపల్లి, ఫిబ్రవరి 5: స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శనివారం ‘చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు’ కార్యక్రమాన్ని పాఠశాల ప్రత్యేకాధికారి జీ ఝాన్సీసౌజన్య ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ప్రతి రోజు గంట సేపు గ్రంథాలయంలో విజ్ఞానం, సామాజిక అంశాలు, నీతికథలు, కవులు, చరిత్ర, రాజకీయ నాయకుల జీవిత చరిత్ర, సైన్స్ తదితర విషయాలకు సంబంధించిని పుస్తకాలను చదవాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది నూర్జహాన్, ఝాన్సీ, కవిత, రమ, మల్లిక, మాధవి పాల్గొన్నారు.