ఖమ్మం కమాన్బజార్/ కొత్తగూడెం గణేశ్టెంపుల్, జూలై 24: ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం సరికాదని, లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన పాఠశాలల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఖమ్మంలో నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.
కొత్తగూడెంలో అమరవీరుల స్థూపం వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన అసమర్థత వల్లనే రెండోసారి నీట్-2026 పేపర్ లీక్ అయ్యిందని మండిపడ్డారు. ఖమ్మంలో ప్రదర్శనకు సీసీఏ నాయకులు రవి మారుతి, ఐవీ రమణారావు, విజయ్ సంఘీభావం తెలిపారు.