కారేపల్లి, అక్టోబర్ 13 : రాష్ట్ర టీజీఓ కార్యవర్గ సభ్యుడు శేషుప్రసాద్ ను కారేపల్లి జూనియర్ కళాశాలలో సోమవారం ఘనంగా సన్మానించారు. కారేపల్లి జూనియర్ కళాశాలలో లైబ్రెరియన్ గా పని చేస్తున్న శేషుప్రసాద్ టీజీఓ కార్యవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయనను కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా శేషుప్రసాద్ మాట్లాడుతూ ఆధ్యాపకులు, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రానున్నట్లు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.