Khammam | క్రీడలు మానసిక ఉల్లాసాన్నిపెంపొందిస్తాయి: ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి..

ఖమ్మం: క్రీడలు మానసిక ఉల్లాసాన్నిపెంపొందిస్తాయని ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి అన్నారు. డిసెంబర్ 6న హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకొని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జిల్లా హోంగార్డ్ ఆఫీసర్స్కు వివిధ క్రీడ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలను ప్రారంభించిన అడిషనల్ డీసీపీ క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో హోంగార్డులకు ప్రత్యేక స్థానం ఉందని ఇదే స్పూర్తితో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
క్రీడల పట్ల మక్కువ పెంచుకుని తమ పిల్లలను సైతం క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని చెప్పారు. గెలుపొందిన విజేతలకు డిసెంబర్ 6వతేదీన పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసిపి విజయబాబు, హోంగార్డ్ ఆర్ఐ శ్రీశైలం, ఆర్ఐలు శ్రీనివాస్, రవి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

