అన్ని మతాలకూ సముచిత గౌరవం
రాష్ట్రంలో అన్ని మతాలకు సముచిత గౌరవాన్ని అందించి సర్వ మత సమానత్వాన్ని చాటుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
- సీఎం కేసీఆర్ చొరవతోనే రాష్ట్రంలో ఆధ్యాత్మిక చింతన
- ఆలయాల అభివృద్ధికి నిధులిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే..
- ఆధ్యాత్మిక దినోత్సవంలో ఎంపీ నామా, ఎమ్మెల్యే కందాళ
కూసుమంచి/ నేలకొండపల్లి, జూన్ 21: రాష్ట్రంలో అన్ని మతాలకు సముచిత గౌరవాన్ని అందించి సర్వ మత సమానత్వాన్ని చాటుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే రాష్ట్రంలో ఆధ్యాత్మిక చింతన వర్ధిల్లుతోందని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా కూసుమంచి శివాలయంలో బుధవారం నిర్వహించిన ఆధ్యాత్మిక ది నోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ బాధ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో ఆలయాలన్నింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని అన్నారు. తరువాత ఎంపీ, ఎమ్మెల్యేలను చైర్మన్ కొక్కిరేణి వీరస్వామి కమిటీ సభ్యులు సత్కరించా రు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, చిత్తారి శ్రీహరియాదవ్, ఇంటూరి శేఖర్, వేముల వీరయ్య, ఎం.వెంకటేశ్వరరావు, ఆసీఫ్, వీరవెల్లి వెంకన్న, కె.సీతారాములు, ఉపేందర్, ఈవో శ్రీకాంత్, కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు దేవులపల్లి శేషరిగిర శర్మ, రంగబాలాజీ, శ్రీను పాల్గొన్నారు.
నేలకొండపల్లిలో..
నేలకొండపల్లిలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవంలోనూ ఎమ్మెల్యే కందాళ పాల్గొన్నారు. నేలకొండపల్లి ఆర్సీఎం చర్చీలో ప్రత్యేక ప్రార్థనలు, మసీదులో ప్రత్యేక నమాజులు చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మరికంటి ధనలక్ష్మి, వజ్జా రమ్య, నంబూరి శాంత, నాగుబండి శ్రీనివాసరావు, ఉన్నం బ్రహ్మయ్య, గండు సతీశ్, మరికంటి రేణుబాబు, వజ్జా శ్రీనివాసరావు, వంగవేటి నాగేశ్వరరావు, కొండా కనకప్రసాదు, జమాల్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

