
ఖమ్మం :ఆధునిక పద్దతుల ద్వారా ఉద్యాన పంటల సాగుపై అవగాహన నిమిత్తం జిల్లా ఉద్యాన రైతులు హైదరాబాద్ లోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ నర్సరీని సందర్శించారు. ఒక్కరోజు శిక్షణ నిమిత్తం ఖమ్మం నియోజకవర్గం ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ సందీప్‌కుమార్ ఆధ్వర్యంలో రఘునాదపాలెం, చింతకాని, కూసుమంచి, కొణిజర్ల మండలాలకు చెందిన 50 మంది రైతులు బుదవారం హైదరాబాద్ వెళ్లడం జరిగింది. పర్యటనలో భాగంగా తొలుత సెంటర్ ఆప్ ఎక్స్‌లెన్స్‌లో జరుగతున్న సాగు విధానం, సాగు పద్దతులు తద్వార అవలంభించేఅంశాలపై సందీప్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం రిసోర్స్ పర్సన్ సుబ్బారావు కూరగాయల సాగులో బింధ సేద్యం ద్వారా ఎలా సాగు చేయాలో అవగాహన కల్పించినట్లు రైతులు తెలిపారు. అదే విధంగా పాలీహౌజ్‌లో సాగు చేస్తున్న పంటలను రైతులు పరిశీలించారు. పరిశోధన అధికారులు కమలాకర్ రెడ్డి, శృతిలు మొక్కల ఆరోగ్య కేంద్రం, భూసార పరీక్షలు, నూతన పద్దతులపై రైతులకు అవగాహన కల్పించారు.