కారేపల్లి, సెప్టెంబర్ 12 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం వెంకిట్యాతండాలో శుక్రవారం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బీక్యతండా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వైద్యాధికారి బి.హిమబిందు ఆధ్వర్యంలో తండావాసులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. షుగర్, బిపి, టీబీ వ్యాధిగ్రస్తులు ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అదేవిధంగా క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని సూచించారు.
మద్యపానం, ధూమపానం, పాన్, గుట్కాలు నమలడం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్యాలు దరి చేరవన్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గర్భిణీలు, స్థానికులకు పలు రకాల వ్యాయామలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సూర్యం, ఏఎన్ఎం విజయలక్ష్మి, అనిత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Karepally : పెంకిట్యాతండాలో ప్రత్యేక వైద్య శిబిరం