భద్రాచలం, డిసెంబర్19 : భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 22న సీతారామ, లక్ష్మణ మూర్తులు సర్వాలంకృతమైన హంస వాహనంపై జల విహారం చేయనున్నారు. అందులో భాగంగా మంగళవారం ఆర్డీవో మంగీలాల్, ఏఎస్పీ పరితోశ్ పంకజ్, దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, ఈఈ రవీందర్ రాజు, పట్టణ సీఐ నాగరాజ్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు హంస వాహనానికి ట్రయల్ రన్ నిర్వహించారు. అలాగే 23న స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం వైభవోపేతంగా నిర్వహించనున్నారు.