కొత్తగూడెం సింగరేణి/ ఇల్లెందు/ సత్తుపల్లి టౌన్/ మణుగూరు టౌన్/ రుద్రంపూర్, జూలై 8 : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంపై సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి జీఎం కార్యాలయాల ఎదుట సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి పదో రోజుకు చేరాయి. ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ దీక్షా శిబిరాన్ని సందర్శించి, అధికారులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోల్ ఇండియాలో మాదిరిగా పే అప్గ్రేడేషన్ను అమలు చేయాలని, పీఆర్పీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. హరిప్రియ వెంట బీఆర్ఎస్ నాయకులు లక్కినేని సురేందర్‌రావు, సిలివేరి సత్యనారాయణ, తోట లలితా శారద, పాబోల్ కిరణ్ తదితరులు ఉన్నారు. కాగా, ఆయా దీక్షల్లో కూర్చున్న వారిలో వెంకటేశ్వర్లు, రాంచందర్, శశికిరణ్, బాబ్జి, సమంత్‌రెడ్డి, రమేశ్, ఉండం బ్రహ్మం, అంజిరెడ్డి, శ్రీనివాసరత్నం, జి.శివప్రసాద్, తుకారాం, కేశవరావు, కేవీ అనిల్‌కుమార్, డి.సూర్యప్రకాశ్, యు.సాయిశ్రావణ్ తదితరులు ఉన్నారు.