కారేపల్లి, ఫిబ్రవరి 18: ప్రత్యేక రాష్ట్ర సాధకుడు,తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును సింగరేణి మండలంలోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, బీఆర్ఎస్వీ నాయకుడు జూపల్లి రాము కలుసుకున్నాడు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో మంగళవారం కలిసి, కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా కలిసినట్లు తెలిపారు.