ఖమ్మం రూరల్ : అనుమానాస్పదస్థితిలో గొర్రెలు, మేకలు మృతి చెందిన(Sheep and goats die) సంఘటన ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మున్సిపాలిటీలోని ఆటో నగర్లో గుర్రలపాడుకు చెందిన గొర్రెలు కాపర్లు బుర్ర వెంకన్న, దొడ్డ ఉపేందర్, దొడ్డ వీరభద్రం నివాసముంటు న్నారు. గత 10 సంవత్సరాల నుంచి గొర్రెలను పెంచుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. కాగా, రోజు వారీ దినచర్యలో భాగంగా గొర్రెలను మేతకు తోలుకొని వెళ్లారు. మధ్యాహ్నన సమయంలో సుమారు పదహారు గొర్రెలు, మేకల అనుమానాస్పదంగా మృతి చెందాయి.
దీంతో సుమారు 2,40,000 రూపాయల వరకు నష్టం వాటిల్లిందని గొర్రెలు కాపర్లు వాపోయారు. విషయం తెలుసుకున్న తల్లంపాడు పశువైద్యశాల డాక్టర్ సమీర సంఘటన స్థలానికి చేరుకొని మేక మృతదేహాలకు పంచనామ నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. రిపోర్టులు వచ్చాక మృతికి గల కారణాలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు.ఒకవైపు ఇప్పటికే బాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పదంగా గొర్రెలు, మేకలు మృతి చెందడం పట్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.