Food Menu | బోనకల్, ఫిబ్రవరి 24: విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని బోనకల్ తహసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్ అన్నారు. బోనకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని అనిశెట్టి పున్నం చందర్ ఇవాళ తనిఖీ చేశారు.
విద్యార్థుల కోసం నిల్వ ఉంచిన బియ్యాన్ని, కూరగాయలు నిత్యవసర వస్తువులను ఆయన పరిశీలించారు. కస్తూర్బా గాంధీ విద్యాలయ వార్డెన్ విద్యార్థుల కోసం తయారు చేసే భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతేకాకుండా భోజన తయారీ సమయంలో తయారీ నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. తహసీల్దార్ వెంట మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య, ఆర్ ఐ గుగులోతు లక్ష్మణ్, ఇన్చార్జి వార్డెన్ రాణి తదితరులు ఉన్నారు.
Kothagudem | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.. కొత్త అక్రెడిటేషన్ కార్డులపై మీడియా అకాడమీ విఫలం..
Kothagudem | మళ్లీ సర్వే చేయండి.. కులగణనలో మున్నూరుకాపులకు అన్యాయం: కాంపెల్లి కనకేష్ పటేల్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!