Road Accident : ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు.ఒక ప్రముఖ పత్రికలో సెకండ్ ఇంచార్జి శ్రీనివాస్ బండి మీద ఆఫీస్కు వెళ్తుండగా.. సాక్షి కార్యాలయం సమీపంలో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను స్థానికులు ఆయనను ఆస్ప్రతికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన లారీని పట్టుకున్నారు.