పాల్వంచ రూరల్, ఆగస్టు 16 : కిన్నెరసాని క్రీడా పాఠశాలలో అండర్-15 విభాగంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను శనివారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
హైదరాబాద్లో ఈ నెల 18, 19 తేదీల్లో జరుగనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు 20 మంది క్రీడాకారులను ఎంపిక చేసి.. వీరికి ఆటలో మరింత తర్ఫీదునిచ్చి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. అక్కడ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి పూణేలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వేణగోపాల్, ఎస్.బాలసుబ్రమణ్యం, కొమరం వెంకటనారాయణ, కవిత, కృష్ణ, శ్రీనివాసరావు, సుజాత, సీత తదితరులు పాల్గొన్నారు.