ఇల్లెందు రూరల్, జూలై 9 : ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్కలు విరివిగా నాటి.. వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని డీఎఫ్వో కిష్టగౌడ్ అన్నారు. మంగళవారం ఒడ్డుగూడెం బీట్ ఫా రెస్టు రేంజ్లో ఆయన అధికారులతో కలిసి బీట్ ను సందర్శించారు. మొక్కలు నాటిని అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు రా కుండా ఉండాలనే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ప్రస్తుత సీజన్లో 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తూ.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. అలాగే రోడ్ల వెంట ఎండిన చెట్లు, మహా వృక్షాల స్థానంలో మళ్లీ మొక్కలు నాటడం వల్ల పునరుజ్జీవం పోసినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీవో కె.వెంకన్న, ఇల్లెందు, కొమరారం రేంజర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.