పెనుబల్లి, మే 17: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిషరించేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం కల్లూరు, పెనుబల్లి మండలాల బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశం పెనుబల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగింది. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ ఓటర్ల జాబితాను పరిశీలించి, మార్పులు చేర్పులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎకడైనా రాష్ట్రంలో ఒకచోట మాత్రమే ఓటు వినియోగం కచ్చితంగా ఉండేలా చూడాలన్నారు. ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి ఓటర్ల జాబితాపై దృష్టి సారించాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని సండ్ర సూచించారు. ఈసారి మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే పొందపరచడం జరుగుతుందని, ప్రతి బూతులో ఇద్దరు స్మార్ట్ ఫోన్ కలిగిన యువకులను ఎంపిక చేసి ప్రతి ఇంటికి తిరుగుతూ ఫొటోతో సహ సభ్యత్వం ఆన్లైన్ చేయాలని కోరారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందిపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీలు అజయ్‌బాబు, మోహన్‌రావు, నాయకులు రఘు, సుధాకర్‌బాబు, వీరమోహన్‌రెడ్డి, వెంకట్‌లాల్, ప్రసాద్, అశోక్‌కుమార్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.