Sand Coupons | ముదిగొండ, ఫిబ్రవరి 11 : గతంలో కొన్ని కారణాల వల్ల ఇసుక కూపన్ల (Sand Coupons) మంజూరు నిలిపి వేశారనీ.. బుధవారం నుంచి మరోసారి ఇసుక కూపన్లు మంజూరు చేయనున్నట్లు తహసిల్దార్ సునీత ఎలిజబెత్ తెలిపారు.
ఇవాళ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ నాయకులు, అధికారులతో ఇసుక కూపన్ల మంజూరుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సునీత మాట్లాడుతూ.. రూ.1500తో డీడీ తీసి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి కూపన్లను మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు వే బిల్లులు మంజూరు చేస్తారని అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ పనులకు మాత్రమే అనుమతులు ఉన్నా.. త్వరలోనే అన్ని అవసరాలకు ఇసుక కూపన్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ మురళి, డీటీ ఉపేందర్, సూపరింటెండెంట్ భాస్కర్ రావు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Mancherial | కోనూర్లో విషాదం.. పంట చేను కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వైరుకు రైతు బలి
Maha Kumbh | మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 43 కోట్ల మంది పుణ్యస్నానాలు