మధిర, ఆగస్టు 07 : గ్రామీణ వికాసం, సౌభాగ్యం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు జ్వాల నరసింహరావు, మందడపు సుబ్బారావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్రావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు పిలుపు మేరకు చింతకాని మండలంలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపును ప్రతి గ్రామంలో వార్డు, మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా పోటీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు కొండా గోపి, మండల కన్వీనర్ మద్దినేని వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు కోరిపెల్లి శ్రీను, అనగాని రామారావు, సిద్దుమియా చెన్నూరి నాగచారి, ప్రధాన కార్యదర్శి గోద మంగయ్య, ఉపాధ్యక్షులు బక్క సత్యమూర్తి, వలనుకొండ నరసింహారావు, రామకోటయ్య పాల్గొన్నారు.