కారేపల్లి (కామేపల్లి), జూన్ 14 : ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని తాళ్లగూడెం సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. ఖమ్మం ఇల్లెందు ప్రధాన రహదారిపై ఇల్లందు నుండి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఖమ్మం నుండి ఇల్లందు వైపు యాష్ లోడుతో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోలో ముందు కూర్చున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీల సహాయంతో వాహనాలను రోడ్డు పక్కకు జరిపి వాహన రాకపోకలను పునరుద్ధరించారు.
Karepalli : ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ప్రయాణికులకు గాయాలు