కూసుమంచి (నేలకొండపల్లి), డిసెంబర్ 31: పాలేరు రిజర్వాయర్ ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలకు రూ.5 కోట్లు, నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం ఆధునీకరణకు రూ 2.5 కోట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో మంజూరు అయ్యాయని పర్యాటక శాఖ ఎస్ఈ సరిత, మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తంబూరి దయాకర్ రెడ్డి అన్నారు. పాలేరు, నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం ప్రాంతాన్ని టూరిజం, గృహనిర్మాణశాఖ, ఆర్కియాలజీ శాఖకు చెందిన అధికారులు మంగళవారం హైద్రాబాద్ నుంచి వచ్చి పరిశీలించారు. పాలేరులో రిసార్ట్, హోటల్, పెడల్ బోట్, 20 మంది వరకు సీట్టింగ్ ఉండే బోటింగ్, ఒక మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణాలు ప్రతిపాదించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వెన్నెపూసల సీతారాములు, డీఈ రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ కన్సెలిటెంట్ ఆర్కెటెక్ హరి, ఆర్కెటెక్ డీడీ రాములు నాయక్, ఏడీ నర్సింగ్, తహసీల్దార్ కరుణశ్రీ, సీఐ సంజీవ్, ఎస్సై నాగరాజు, ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి, డిసెంబర్ 31: కూసుమంచి శివాలయం అభివృద్ధి పనుల కోసం రూ. 3.75 కోట్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రతిపాదనలు అందజేశారు. మంగళవారం శివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి క్యాంపు కార్యాలయం ఇన్చార్జి తంబూరి దయాకర్ రెడ్డి, ఆలయ పునర్ నిర్మాణ కర్త సాధువీర ప్రతాపరెడ్డి, ప్రముఖులు మాట్లాడుతూ ఆలయంలో మిగిలిపోయిన పనులు, ప్రాంగణంలో ఆలయానికి సంబంధించిన పనులు చేపడతామన్నారు. కార్యక్రంలో నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నెపూసల సీతారాములు, ఎస్సై అఖిల్, దేవాలయ చైర్మన్ రేలా ప్రదీప్ రెడ్డి, ఉపేందర్ రావు, మోహన్, దామోదర్ రెడ్డి, పూజారి శేషగిరి శర్మ, ఈవో శ్రీకాంత్ పాల్గొన్నారు.