అపరిశుభ్రత నడుమ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సమావేశం
కారేపల్లి మండల పరిధిలోగల రొట్ట మాకిరేవు రైతు వేదిక భవనం అపరిశుభ్రత నడుమ కొట్టుమిట్టాడుతుంది. లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని నిర్లక్షం కారణంగా దుర్వినియోగం చేస్తున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా..
కారేపల్లి, మే 07 : కారేపల్లి మండల పరిధిలోగల రొట్ట మాకిరేవు రైతు వేదిక భవనం అపరిశుభ్రత నడుమ కొట్టుమిట్టాడుతుంది. లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని నిర్లక్షం కారణంగా దుర్వినియోగం చేస్తున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఈ భవనాలలోనే సౌకర్యవంతంగా ఉండడంతో అధికారులు నిర్వహిస్తున్నారు. భవనాల లోపల, బయట పరిశుభ్రత మాత్రం సంబంధిత శాఖ క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ సిబ్బంది పట్టించుకోక పోవడం వల్ల అపరిశుభ్రంగా మారుతున్నాయి. రొట్టమాకి రేవులో గల రైతు వేదిక భవనంలో గురువారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యుత్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ క్షేత్రాలు-సౌర విద్యుత్ కేంద్రాలు అనే అంశంపై అవగాహన కల్పించారు. అయితే ఈ సదస్సుకు పలువురు ప్రజా ప్రతినిధులు, రైతులు సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు హాజరయ్యారు.

అపరిశుభ్రత నడుమే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సమావేశం
సమావేశపు మందిరంలో గల అపరిశుభ్రతను చూసి పలువురు అసహనం వ్యక్తం చేశారు. బూజు పట్టిన గోడలు, నేలపై ఉన్న దుమ్ము, ధూళి, చెత్త, చేదారం మధ్యలోనే అధికారులు తమకేమి పట్టనట్టు అధికారిక కార్యక్రమాన్ని చేపట్టి చేతులు దులుపుకున్నారు. ఉన్నత లక్ష్యాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నత లక్ష్యాలతో రైతు వేదికలను నిర్మించింది. రైతులకు సలహాలు, సూచనలు,శిక్షణ తరగతులు, నూతన వంగడాలు, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తనాల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ రైతు వేదికలను నిర్మించింది. ప్రతి 5 వేల మంది రైతులకు రెండు నుంచి నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రైతు వేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో శిథిలావస్థకు చేరుకునే పరిస్థితులు నెలకొన్నాయి.

అపరిశుభ్రత నడుమే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సమావేశం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

