కారేపల్లి, నవంబర్ 18 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేలకాయలపల్లి గ్రామానికి చెందిన జర్పుల సందీప్తి (20) గడిచిన శుక్రవారం పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంది. ఆ పరిసర గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేసే నామ నరేశ్ ప్రేమ, పెండ్లి పేరుతో మానసికంగా, సామాజికంగా ఇబ్బందులకు గురిచేయడంతో తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు నామా నరేశ్‌ను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ బైరు గోపి తెలిపారు.