‘వలస పాలకుల పాలనలో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి విక్రమార్క ప్రజల బాగోగులను పట్టించుకోలేదు. కానీ.. లింగాల కమల్‌రాజు ఒకవైపు జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేశారు. కాంగ్రెసోళ్లకు ఢిల్లీ ప్రభువులు హైకమాండ్ అయితే.. బీఆర్ఎస్కు ప్రజలే హైకమాండ్’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మధిరలో సోమవారం నిర్వహించిన పార్టీ జోనల్ స్థాయి బూత్ కమిటీ సమావేశంలోమంత్రి పాల్గొని మాట్లాడారు.
మధిర, అక్టోబర్ 16: కాంగ్రెసోళ్లకు ఢిల్లీ ప్రభువులు హైకమాండ్ అయితే.. బీఆర్ఎస్కు ప్రజలే హైకమాండ్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మధిర పట్టణంలో సోమవారం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజుతో కలిసి బోనకల్లు, ఎర్రుపాలెం, ముదిగొండ, చింతకాని, మధిర మండలాలకు చెందిన 5 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ ప్రైవేటు స్థలంలో నిర్వహించిన పార్టీ జోనల్ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. వలస పాలకుల పాలనలో ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లు భట్టి విక్రమార్క ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదన్నారు. కానీ లింగాల కమల్‌రాజు ఒకవైపు జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారని గుర్తుచేశారు. కార్యకర్తలు, నాయకులు 45 రోజుల పాటు సైనికుల్లా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థి కమల్‌రాజును గెలిపించుకోవాలన్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో విడుదల చేస్తే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తమ పార్టీ స్కీములను కాపీ కొట్టారని వ్యాఖ్యానించడం అవివేకమన్నారు. కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్ ఆసరా పథకాన్ని కాపీ కొట్టిందని మండిపడ్డారు. కార్యకర్తలు వచ్చే నెల 5న ఖమ్మంలో జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలన్నారు.
నియోజకవర్గం నుంచి భారీ జనసమీకరణ చేయాలన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గడిచిన ఎన్నికల్లో కొందరు పక్కనే ఉండి, తీరా పోలింగ్ నాటికి కమల్రాజుకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేసి కమల్‌రాజును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించాలన్నారు. తాను నియోజకవర్గంలో నిర్వహించే ప్రతి సమావేశానికి హాజరవుతానన్నారు. బీఆర్ఎస్ మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ.. తాను మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయానన్నారు. నాలుగోసారీ పోటీ చేస్తున్నానని, ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు అనేక సంస్థలు నిర్వహించిన సర్వేలన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగానే ఉన్నాయన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెసోళ్లు ప్రజలకు ఏ ప్రయోజనమూ చేకూర్చలేదన్నారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలోనే రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు, మధిర మున్సిపల్ చైర్పర్సన్ లత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, ఆత్మకమిటీ చైర్మన్ రామారావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ విద్యాలత, ఎంపీపీలు శిరీష, లలిత, పూర్ణయ్య, జడ్పీటీసీలు కవిత, దుర్గ, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, మల్లికార్జున్, సాంబశివరావు, లక్ష్మారెడ్డి, పుల్లయ్య, వేమూరి ప్రసాద్, పోట్ల ప్రసాద్, చావా వేణు, వాసు, కృష్ణప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు.