కారేపల్లి, జూన్ 11 : సింగరేణిలో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్(టోనీ) వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ కు వినతిపత్రం అందజేశారు. గురువారం ఎమ్మెల్యేను కలిసిన సర్పంచ్ కారేపల్లిలో హెల్త్ సబ్ సెంటర్ ఉన్నా భవనం లేకపోవడంతో వైద్య సేవల కోసం పీహెచ్‌సీపై ఆధారపడాల్సి వస్తుందని వినతిలో తెలిపారు. భరత్‌నగర్ కాలనీలో ఉన్న హెల్త్ సెంటర్ భవనం శిథిలావస్ధకు చేరుకుందని, దానిని తొలగించి నూతనంగా భవన నిర్మాణం చేయాల్సి ఉంటుందని ఎమ్మెల్యేకు సర్పంచ్ టోనీ విన్నవించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హెల్ట్ సబ్‌సెంటర్ భవన నిర్మాణానికి ప్రతిపాధనలు పంపించాలని జిల్లా వైద్యాధికారికి లేఖ రాశారని సర్పంచ్ తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యేకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు ఎండీ.యాకూబ్ అలీ, ఆదెర్ల రాములు ఉన్నారు.
కారేపల్లి మండలంలోని కమలాపురం సబ్ సెంటర్ భవన నిర్మాణం జరిగి దానిలో అన్ని వసతులతో సబ్ సెంటర్ నడుస్తుందని మండల వైద్యాధికారి బి.సురేష్ తెలిపారు. కమలాపురం సబ్ సెంటర్ భవనానికి మరోసారి నిధులకు పరిపాలన మంజూరు జరిగాయన్నారు. ఆ నిధులను సింగరేణి సబ్ సెంటర్‌కు మార్పు చేస్తూ పరిపాలన ఉత్తర్వులు ఇప్పించాలని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ కు మండల వైద్యాధికారి లేఖ రాశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోను ఎమ్మెల్యే కోరారు.