తెలంగాణ చారిత్రక ఘట్టం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలుపెరుగని పోరాటం చేసింది కేసీఆరేనని, ఆయన పట్టుదలతో చేపట్టిన దీక్ష ఒక చారిత్రక ఘట్టమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సభకు పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షత వహించారు.
- రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం
- స్థానిక ఎన్నికల్లో బీసీలకు అండగా బీఆర్ఎస్ పార్టీ
- గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదాం..
- భద్రాద్రి జిల్లాలో ‘దీక్షా దివస్’లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
- పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వనమా, మెచ్చా, హరిప్రియ
- ఉద్యమ నేత దిండిగాల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, రావులపల్లి రాంప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలుపెరుగని పోరాటం చేసింది కేసీఆరేనని, ఆయన పట్టుదలతో చేపట్టిన దీక్ష ఒక చారిత్రక ఘట్టమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సభకు పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షత వహించారు. తొలుత ప్రగతి మైదాన్‌లో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమవీరులకు బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం జరిగిన దీక్షా దివస్ సభలో వద్దిరాజు మాట్లాడారు. పలు సందర్భాలలో వివిధ ప్రాంతాల్లో ఎంతో మంది ఎన్నో పోరాటాలు చేసినా చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసిన పోరాటమే తెలంగాణ ఉద్యమమని, అది కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని, తెలంగాణకు చరిత్ర కేసీఆరేనని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు కూడా కీలకపాత్ర పోషించారని, తమ ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా తెగించి పోరాటం చేశారన్నారు. బీసీలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు.

ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అంటూ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రత్వానికి బీఆర్ఎస్ నేతలపై అవాకులు చవాకులు పేలడం తప్ప ఏమీ తెలియదని మండిపడ్డారు. చరిత్ర ఆనవాళ్లు లేకుండా చెరిపివేయాలని చూడడం ఎవరి తరం కాదన్నారు. ప్రభుత్వం 46 జీవోను తెరపైకి తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందని, దమ్ముంటే ఎంపీటీసీ ఎన్నికల్లోనైనా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అక్రమ మార్గంలో కేసులు, బెదిరింపులతో విజయం సాధించారని, అది గెలుపు కాదన్నారు. భద్రాద్రి జిల్లాలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో మా సత్తా ఏమిటో చూపిస్తామన్నారు.
సర్పంచ్‌లను గెలిపించి కేసీఆర్‌కు బహుమతి ఇవ్వాలి..
- రేగా కాంతారావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా సర్పంచ్‌లను గెలిపించి ప్రాణాలొడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు కష్టపడి పని చేయాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీలో ఇప్పటికే బీఆర్ఎస్కు విజయ సంకేతాలు వచ్చాయని, ఈ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

పాల్వంచ కేంద్రంగా ఉద్యమం వనమా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి
అప్పట్లో పాల్వంచ కేటీపీఎస్‌లో ఆంధ్రా, తెలంగాణ ఉద్యమం తన హయాంలో జరిగిందని, అందులో పాలుపంచుకున్నట్లు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. అప్పట్లోనే తెలంగాణ వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేటీపీఎస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు ఎన్నో పదవులు చేశానని అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే పాల్వంచలో కాలనీకి కేసీఆర్ నగర్ పేరు పెట్టామని గుర్తు చేశారు. ప్రస్తుతం జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, సత్తా చాటుతామన్నారు.

ప్రపంచం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్ కేసీఆర్ ఉద్యమం గురించి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియానాయక్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కాపు కృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, కాంపెల్లి కనకేష్, మంతపురి రాజుగౌడ్, కొట్టి వెంకటేశ్వర్లు, బత్తుల వీరయ్య, అన్వర్ పాషా, సంకుబాపన అనుదీప్, సింధు తపస్విని, దామోదర్, రాజశేఖర్, కూసన వీరభద్రం, మాజీ ఎంపీపీలు శాంతి, సోనా, అరుణ, నవతన్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

