AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
AP News | ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఎలక్ట్రిక్ రంపంతో విద్యార్థిని పై దాడి చేయడం తీవ్ర కలకలం సృష్టించింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ( Anantapur district ) జిల్లాలో దారుణం ( Horrific inciden) జరిగింది. ఓ నిందితుడు తరగతి గదిలోకి చొచ్చుకుపోయి ఎలక్ట్రిక్ రంపంతో విద్యార్థిని ( Female Student ) పై దాడి చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది.
శనివారం ఉదయం పాఠశాల తరగతులు ప్రారంభమైన కొద్ది సేపటికే పదో తరగతి గదిలోకి వెళ్లిన ధర్మవరం మండలం నాగలూరికి చెందిన హేమంత్ అనే నిందితుడు వెంట తెచ్చుకున్న రంపంతో విద్యార్థినిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె చేయి తెగిపోగా , మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని గ్రామస్థులు హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది.
దాడి చేసిన నిందితుడి అక్కడి నుంచి పరారీ కావడంతో పోలీసులు ధర్మవరం రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పేరెంట్స్ చనిపోవడంతో అయ్యవారిపల్లెలో అక్క దగ్గర ఉంటున్నట్లు గుర్తించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

