NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
NBK 112 | నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రం NBK 112పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య మాస్ ఇమేజ్‌కు కొరటాల శివ మార్క్ కథనం తోడైతే థియేటర్లలో అభిమానులకు పండగే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
NBK 112 | నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రం NBK 112పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య మాస్ ఇమేజ్‌కు కొరటాల శివ మార్క్ కథనం తోడైతే థియేటర్లలో అభిమానులకు పండగే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సంగీత దర్శకుడి ఎంపికపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
NBK 112కు సంగీతం అందించబోయే దర్శకుడు ఎవరనే విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తొలుత తమిళ స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్‌కు పనిచేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత అనిరుధ్ స్థానంలో మరో ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌ను తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో బాలయ్య సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించబోతున్నారని అభిమానులు భావించారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో మ్యూజిక్ డైరెక్టర్ ఎంపికపై ఆసక్తి మరింత పెరిగింది.
సంగీత దర్శకుడి ఎంపికపై వస్తున్న వరుస ప్రచారాలకు చిత్ర బృందం తాజాగా స్పందించింది. అనిరుధ్ రవిచందర్, జీవీ ప్రకాష్ కుమార్‌లలో ఎవరినీ ఇప్పటివరకు అధికారికంగా ఖరారు చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పలువురు సంగీత దర్శకులతో చర్చలు జరుగుతున్నప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయిన తర్వాత చిత్ర బృందమే అధికారికంగా వివరాలు వెల్లడించనుంది. అప్పటివరకు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని మేకర్స్ సూచించారు.. దీంతో ఇప్పటివరకు వినిపించిన పేర్లన్నీ ఊహాగానాలేనని స్పష్టమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

