Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
Sanjeev Arora: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేసింది. 100 కోట్ల జీఎస్టీ అక్రమాల కేసులో జైలులో ఉన్న సంజీవ్ అరోరాకు కూడా ఆప్ సీటు కేటాయించింది. లుథియానా వెస్ట్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు.
చండీఘడ్: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేసింది. ధూరి నియోజకవర్గం నుంచి సీఎం భగవంత్ మాన్ పోటీ చేయనున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ తర్వాత 40 మంది జాబితాను వెల్లడించారు. మనీల్యాండరింగ్ కేసులో ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న మంత్రి సంజీవ్ అరోరాను కూడా అభ్యర్థిగా ప్రకటించారు. లుథియానా వెస్ట్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ప్రస్తుతం గురుగ్రామ్‌లో ఉన్న బోన్దిసీ జైలులో ఆయన ఉన్నారు. సుమారు 100 కోట్ల మేర జీఎస్టీ లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఊరట కల్పించాలని కోరుతూ సంజీవ్ ఆరోరా పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను 15 రోజుల క్రితమే పంజాబ్ కోర్టు తిరస్కరించింది.
సంజీవ్ అరోరా లుథియానాలో 1963, సెప్టెంబర్ 18వ తేదీన జన్మించారు. వ్యాపారవేత్త అయిన ఆయన 2022లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆయన.. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్‌లోనూ వ్యాపారం కొనసాగించారు.హాంప్టన్ స్కై రియాల్టీ లిమిటెడ్ సంస్థతో ఆయనకు లింకున్నది. లుథియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం ఆయన తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆ అఫిడవిట్లో ఆయన 278 కోట్ల ఆస్తిని చూపించారు. పంజాబ్ అసెంబ్లీలో ఆయనే సంపన్న వ్యక్తిగా ఉన్నారు. ఆయన భార్య ఆస్తులతో కలిపి మొత్తం 302 కోట్లు ఉన్నది.
2022 ఏప్రిల్ నుంచి 2025 జూలై వరకు ఆయన రాజ్యసభలో ఉన్నారు. కృష్ణ ప్రాణ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఛారిటీ ట్రస్టును నడిపించారు. అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు 2025 ఫిబ్రవరిలో ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేత భరత్ భూషణ్‌ను 10 వేల ఓట్ల తేడాతో ఓడించారు. సీఎం భగవంత్ మాన్ కేబినెట్లో సంజీవ్ ఆరోరాకు పరిశ్రమలు, ఎన్ఆరై అఫైర్స్ మంత్రిత్వశాఖలను అప్పగించారు. విద్యుత్తు శాఖను కూడా ఆయనకే ఇచ్చారు. 2026 మే 9వ తేదీన అరోరాను ఈడీ అరెస్టు చేసింది. యాపిల్, శాంసంగ్ మొబైల్ డివైస్‌లను ఎగుమతి చేసిన కసులో.. సుమారు వంద కోట్ల జీఎస్టీ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మనీల్యాండరింగ్ చట్టం కింద అరోరాపై ఈడీ కేసు బుక్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

