అశ్వారావుపేట/ అశ్వారావుపేట టౌన్, ఆగస్టు 30 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని, ఆ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గరపడ్డాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. శనివారం అశ్వారావుపేటలోని సత్యసాయి కల్యాణమండపంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టే ఎవ్వరినీ వదలబోమని అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామా అని ప్రజలు బాధపడుతున్నారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90శాతం బీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా ఎన్నికల్లో ముందుకుసాగి సర్పంచ్, వార్డుల్లో విజయకేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని అన్నారు. స్థానిక సంస్థల్లో గ్రామగ్రామాన బీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా రైతు సంఘం మాజీ అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, పార్టీ సెక్రటరీ దొడ్డా రమేష్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, మోరంపూడి అప్పారావు, సున్నం నాగమణి, ఏట్ల నాగమణి, లలిత, రామారావు, దారా బాబు, వెంకటేశ్వరావు, యూఎస్ ప్రకాష్, జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సత్యవరపు సంపూర్ణ, నారం రాజశేఖర్, వగ్గెల పూజ, జుజ్జరపు వెంకన్నబాబు, చిట్టూరి ఫణీంద్రకుమార్, కోడూరు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 30 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేనెల 10, 11 తేదీల్లో రెండ్రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారని, ఆయన పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్త సమావేశంలో వారు మాట్లాడారు. కేటీఆర్ పర్యటనతో పార్టీ బలోపేతం కావడంతోపాటు కార్యకర్తల్లో ఆత్మైస్థెర్యం పెరుగుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, అంబుల వేణు, రుక్మాంగధర్ బండారి, వేముల ప్రసాద్, తాండ్ర శ్రీను, దూడల బుచ్చయ్య, తోగరు రాజశేఖర్, మేకల నాగబాబు, శ్రీనివాస్, పిల్లి కుమార్ పాల్గొన్నారు.