తేజా రకం మిర్చి క్వింటాల్ ధర రూ.23,000
నగరంలోని వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఎండు మిర్చి ధర రాకెట్లా దూసుకెళ్తున్నది. మిర్చి రైతుల ఊహకు కూడా అందనంతగా క్వింటాల్‌కు రూ.23,000 పలుకుతున్నది. సీజన్ ఆరంభంలో విదేశాలకు పంటను ఎగుమతి చేసే వ్యాపారులు భారీగా కొన్నారు.
- ఖమ్మం ఏఎంసీలో పోటీపడి కొంటున్న వ్యాపారులు
ఖమ్మం వ్యవసాయం, మార్చి 16: నగరంలోని వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఎండు మిర్చి ధర రాకెట్లా దూసుకెళ్తున్నది. మిర్చి రైతుల ఊహకు కూడా అందనంతగా క్వింటాల్‌కు రూ.23,000 పలుకుతున్నది. సీజన్ ఆరంభంలో విదేశాలకు పంటను ఎగుమతి చేసే వ్యాపారులు భారీగా కొన్నారు. వీరు కొద్ది రోజుల క్రితం వరకు ఖమ్మం మార్కెట్ నుంచి నేరుగా నౌకాశ్రయాలకు, అక్కడి నుంచి విదేశాలకు తేజా రకం మిర్చిని ఎగుమతి చేశారు. విదేశాల నుంచి ఆర్డర్లు పెరగడం, మార్కెట్‌కు పంట రావడం తగ్గిపోవడంతో వ్యాపారులు పోటీ పడుతూ రేటు పెంచారు.
డిమాండ్ ఎక్కువ.. ఉత్పత్తి తక్కువగా ఉండడం.. రైతులపై కనక వర్షంలా కురుస్తున్నది. మార్కెట్ యార్డుకు గురువారం ఉదయం జెండా పాట సమాయానికి వివిధ జిల్లాల నుంచి 26,000 మిర్చి బస్తాలు వచ్చాయి. జెండా పాటలో క్వింటాల్ గరిష్ఠ ధర రూ.23,000, మధ్య ధర రూ.20,900, కనిష్ఠ ధర రూ.18,300 పలికింది. తాలు రకం మిర్చి క్వింటాల్ ధర రూ.14,000 పలికింది. రాబోయే కొద్ది రోజుల్లో క్వింటాల్ ధర రూ.25,000కు చేరుకోవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇలా ‘ఎర్ర బంగారాని’కి యమ డిమాండ్ ఉండడంతో తమ ‘పంట పండింద’ని మిర్చి రైతులు సంబురపడుతన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

