ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 6 మండలాలలో కలిపి 85.95% పోలింగ్ నమోదు కాగా అత్యంత రికార్డు స్థాయిలో ఖమ్మం రూరల్ మండలంలో 91.3 % ఓట్లు నమోదై చరిత్ర సృష్టించినట్లయింది. మండలంలో మొత్తం ఓటర్లు 33 వేల ఎనిమిది వందల యాబై ఒక్క మంది కాగా వారిలో 30 వేల ఎనిమిది వందల 16 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ప్రకటించారు.
మధ్యాహ్నం ఒంటిగంట లోపు క్యూ లైన్ లో ఉన్న ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించామని, ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 19 పంచాయతీల సర్పంచుల అభ్యర్థులకు 184 వార్డు నియోజకవర్గం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయననారు. ఖమ్మం రూరల్ ఏసీబీ తిరుపతిరెడ్డి, డిసిపి అడ్మిన్ విజయబాబు, ఏఆర్ ఏసిపి నర్సయ్య, పోలీసు సిబ్బంది అధికారులతో కలిసి ఆయా గ్రామాల్లో బందోబస్తు చర్యలు చేపట్టారు.