బోనకల్లు: రేషన్డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోనకల్లు మండల రేషన్ డీలర్లు శనివారం ఖమ్మంలోని జిల్లా పరిషత్ భవనంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లింగాల కమలరాజు మాట్లాడుతూ డీలర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రేషన్డీలర్లు జడ్పీచైర్మన్ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర రేషన్డీలర్ల జాయింట్ సెక్రటరీ సుంకర రామారావు, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు బంధం అచ్చయ్య, బోనకల్లు మండల రేషన్డీలర్ల సంఘం నాయకులు తోట లింగయ్య, తన్నీరు నర్మద, సైదానాయక్, గోపి, సత్తారుమియా, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.