కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమమే..
ఎమ్మెల్సీ కవిత అరెస్టు ముమ్మాటికే అక్రమమేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమెపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
- ఉద్దేశపూర్వకంగానే ఆమెపై తప్పుడు కేసులు బనాయించారు..
- ఈ కేసులో ఆమె బాధితురాలే తప్ప నిందితురాలు కాదు..
- ధర్మం గెలుస్తుంది.. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసముంది..
- ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు
ఖమ్మం, మార్చి 22: ఎమ్మెల్సీ కవిత అరెస్టు ముమ్మాటికే అక్రమమేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమెపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తప్పుడు కేసులు పెట్టిందని అన్నారు. ఈ కేసును టీవీ సీరియల్ మాదిరిగా రెండేళ్లు సాగదీసిందని, ఇప్పుడు ఎన్నికల వేళ దాన్ని తెరపైకి తెచ్చిందని అన్నారు. 2004 నుంచి 2014 వరకు కేవలం 200 కేసులను మాత్రమే నమోదు చేసిన ఈడీ.. 2014 నుంచి ఈ పదేళ్ల కాలంలో ఏకంగా 2,954పైగా కేసులు నమోదు చేసిందని అన్నారు. అసలు ఈ కేసుతో కవితకు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఇందులో ఆమె బాధితురాలే తప్ప నిందితురాలు కాదని అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ధర్మం తప్పకుండా గెలుస్తుందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా ఈ కేసును బయటకు వస్తారని అన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

