ఖమ్మం, జూన్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి), మహబూబాబాద్ రూరల్ : ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులుగా ఇటీవల గెలుపొందిన రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్ లోక్సభలో మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజు తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఎంపీలకు అవకాశం ఇవ్వగా వారిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో రఘురాంరెడ్డి చివరగా జైహింద్, జై తెలంగాణ, జై సంవిధాన్ అంటూ ముగించి ఆలోచింపజేశారు.