Puvvada Ajaykumar | బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉద్యమిస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పువ్వాడ వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో, పరిపాలనలో పూర్తిగా విఫలమైందని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతోపాటు ప్రజలను చైతన్యపరిచేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని అన్నారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
Switzerland | స్విట్జర్లాండ్ రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు
వైభవంగా మార్వాడీల కావడి యాత్ర.. హరిహర మహాదేవ’ నామస్మరణతో సాగిన భక్తుల పాదయాత్ర
TVK vs Cong | కాబోయే ప్రధాని విజయ్ అంటూ జోరుగా ప్రచారం.. అధికార కూటిమిలో కలకలం..!