ఖమ్మం : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.45 లక్షల విలువైన 45 చెక్కులను మంత్రి పువ్వాడ లబ్ధిదారుల ఇళ్ల కు వెళ్లి స్వయంగా అందజేశారు. గొల్లగూడెం రోడ్ నుంచి భారీ మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిరుపేదలైన ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్ లాంటి పథకాలు వరంలాంటిదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకోల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ పాతిమా జోహారా, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, జిల్లా కార్యాలయ ఇంచార్జీ ఆర్జెసీ కృష్ణ, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, కర్నాటి కృష్ణ, కురాకుల వలరాజు, గజ్జెల లక్ష్మీ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.