మధిరటౌన్, అక్టోబర్ 28: కారు గుర్తుకు ఓటు.. అభివృద్ధికి మలుపు అని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమలరాజు అన్నారు. శనివారం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలోనే మధిర పట్టణ అభివృద్ధి సాధ్యమైందన్నారు. తన చొరవతోనే 100 పడకల ఆసుపత్రి, మినీ ట్యాంక్‌బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పార్క్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇప్పటికీ రూ.30 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల పోలింగ్‌లో బీఆర్ఎస్కు ఓటేసి ఆశీర్వదించాలన్నారు. ఎన్నికల గెలిచిన తర్వాత మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పల్లపోతుల వెంకటేశ్వరరావు, బిక్కి కృష్ణప్రసాద్, కరివేద సుధాకర్, డోకుపర్తి సత్యంబాబు, వై.వి.అప్పారావు, దుర్గాప్రసాద్, కృష్ణ పాల్గొన్నారు.