కారేపల్లి, సెప్టెంబర్ 10 : వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) తెగువ, స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని సీపీఐ(ఎం) కారేపల్లి మండల కార్యదర్శి కె.నరేంద్ర అన్నారు. బుధవారం గాంధీనగర్లో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశంలో భూ సంస్కరణలు అనే అంశం తెరపైకి తీసుకు వచ్చిందన్నారు. ఐలమ్మ సూర్పితో ప్రజాపోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యుడు వజ్జా రామారావు, మండల కమిటీ సభ్యులు కేసగాని ఉపేందర్, ముండ్ల ఏకాంబరం, సీనియర్ నాయకులు కేసగాని రామ్మూర్తి, ఎజ్జు రత్నం, రాకూరి రమేశ్, కె.నీలిమ పాల్గొన్నారు.