మధిర, మే 23 : మధిర పట్టణంలోని ఆజాద్ రోడ్లో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి సైకోల వ్యవహరిస్తూ హల్ చల్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నం చేసే సందర్భంలో మహిళలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంట్లోకి చొరబడే ప్రయత్నంలో స్థానిక యువకులు కొంతమంది బయటకు తీసుకువచ్చి పంపిస్తున్న సందర్భంలో వారిపై తిరగబడ్డాడు. అయినప్పటికీ అతడిని కొట్టకుండా బయటికి పంపించేశారు. అలాగే హల్చల్ చేస్తూ రోడ్డుపై ఉన్న మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు ఉపయోగించే పార తీసుకుని అక్కడున్న వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఉమా మహేశ్వరరావు అనే వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పిపోయింది. లేకపోతే సైకో చేతిలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి.