వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి..
జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ పోలీసు అధికారులను ఆదేశించారు. నాయకన్‌గూడెం టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టును, పెరికసింగారం, జుఝల్రావుపేట, నాయకన్‌గూడెం, ఈశ్వరమాధారం, రాజుపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- ప్రతి బండి నెంబర్ నమోదు చేయాలి
- పోలింగ్ కేంద్రాల్లో వసతులు సమకూర్చండి : కలెక్టర్ వీపీ గౌతమ్
కూసుమంచి, మార్చి 22 : జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ పోలీసు అధికారులను ఆదేశించారు. నాయకన్‌గూడెం టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టును, పెరికసింగారం, జుఝల్రావుపేట, నాయకన్‌గూడెం, ఈశ్వరమాధారం, రాజుపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్టు వద్ద రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డిని.. రిజిస్టర్ మెయింటెనెన్స్, వాహన తనిఖీలు ఎలా చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. తనిఖీ చేసిన ప్రతి వాహనం నెంబర్‌ను నమోదు చేయాలని, వీడియోలు తీస్తూ 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన
పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యుత్, తాగునీరు, మిషన్ భగీరథ నీరు రాని కేంద్రాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఓటరు జాబితాను తనిఖీ చేసి.. బీఎల్వోల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కు తెలిసే విధంగా వాల్ పెయింటింగ్ వేయించి పోలింగ్ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. పోలింగ్ సమయంలో గతంలో ఏమైనా ఇబ్బందులు కలిగాయా? అనే విషయాలను అధికారులు, ఉపాధ్యాయులు, ఎస్సై కిరణ్‌ను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాలేరు రిటర్నింగ్ అధికారి ఆర్.రాజేశ్వరి, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, ఈఈ వెంకటరెడ్డి, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, డీఈ వేణుగోపాల్, తహసీల్దార్ సురేశ్, ఏవో వాణి, ఉద్యానవన అధికారి అపర్ణ, ఎస్సై కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

